తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్‌ మెడపై రూపాయి పచ్చబొట్టుకు ఇంత కథ ఉందా? - మెడపై పచ్చబొట్టుతో మహేశ్​బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తనయుడు మహేశ్‌బాబు ఇచ్చిన 'సర్కారు వారి పాట' సర్‌ప్రైజ్​ లుక్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రిన్స్​ చెవి పోగు ధరించి, మెడపై రూపాయి టాటూతో సరికొత్తగా కనిపించారు. అయితే ఆ పచ్చబొట్టు వెనుక ఓ కారణం ఉందట.

Mahesh Babu 1 Rupee Coin Tattoo
మహేశ్‌ మెడపై రూపాయి టాటూకు ఇంత కథ ఉందా?

By

Published : Jun 2, 2020, 7:02 AM IST

సీనియర్‌ నటుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు మహేశ్‌బాబు కొత్త సినిమా టైటిల్‌, ప్రీలుక్‌ను చిత్ర బృందం వెల్లడించింది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'సర్కారు వారి పాట' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహేశ్‌ ప్రీలుక్‌లో చెవికి పోగు, మెడపై రూపాయి టాటూ, మాసిన గడ్డంతో రఫ్‌గా కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మహేశ్‌ మెడపై రూపాయి పచ్చబొట్టు వెనుక ఆసక్తికర కథ ఒకటి సామాజిక మాధ్యమాల్లోనూ, టాలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతోంది.

పరశురామ్‌ ఈ కథను తొలుత అమెరికా నేపథ్యంలో రాసుకున్నారట. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి షూటింగ్‌ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ నేపథ్యాన్ని ఇండియాకు మార్చారని టాక్‌. దాంతో డాలర్‌ సింబల్‌తో మెడపై టాటూ వేయాల్సి ఉండగా, దాన్ని రూపాయి టాటూగా మార్చారట‌. మహేశ్‌ చెవికి ఉన్న పోగు, రఫ్‌ లుక్‌ చూస్తుంటే.. ఆయన పాత్రకు 'పోకిరి' సినిమాలోని మాస్​ లక్షణాలు ఉంటాయని అంటున్నారు.

మెడపై పచ్చబొట్టుతో మహేశ్​బాబు

ఇటీవలె మహేశ్‌ తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా మాట్లాడుతూ.. "సర్కారు వారి పాట' బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్‌. నిజంగా ఈ సినిమా విషయంలో ఉత్సుకతగా ఉన్నా" అని అన్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఇందులో మహేశ్‌ ఎలా కనిపిస్తారు? ఆయన రోల్​ ఎలా ఉంటుంది? కథానాయిక ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

'సర్కారు వారి పాట' ప్రీ-లుక్‌ పోస్టర్‌ విడుదలైన 24 గంటల్లో అత్యధికంగా రీట్వీట్‌ చేసిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది. ఎక్కువగా లైక్‌లు, అత్యధికంగా ట్వీట్‌ చేసిన టైటిల్ ట్యాగ్‌గా సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండగా, పీఎస్‌ వినోద్‌ కెమెరామెన్‌గా, ఎడిటర్‌ మార్తాండ్‌.కె వెంకటేష్‌లు పనిచేయనున్నారు.

  1. రికార్డులతో దూసుకెళ్తోన్న 'సర్కారు వారి పాట' ప్రీలుక్
  2. 26 ఏళ్లపుడు క్రష్ ఉంది.. మ్యాగీ చేస్తా: మహేశ్

ABOUT THE AUTHOR

...view details