తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ పేర్లు ఎందుకలా? - comedian sunil

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..  గత రెండు సినిమాల్లో హాస్యనటుడు సునీల్​కు అవకాశమిచ్చాడు. అయితే అందులో సునీల్​ పాత్రలకు అమ్మాయిల పేర్లు పెట్టాడు. దీని వెనకున్న కారణమేంటి? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ పేర్లు ఎందుకలా?
హాస్యనటుడు సునీల్​

By

Published : Jan 13, 2020, 5:16 AM IST

ఒకానొక దశలో సునీల్‌.. హాస్యనటుడిగా టాలీవుడ్​లో శిఖర స్థాయిని అందుకున్నాడు. కానీ, హీరోగా మారి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాక, రెండు విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ తన పాత దారిలోకే వచ్చేశాడు. సునీల్​ కెరీర్‌ను తిరిగి గాడిన పెట్టాలని.. ప్రాణ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల తాను తీసిన 'అరవింద సమేత'తో సునీల్​ను తిరిగి హాస్యనటుడిగా తెరకు పరిచయం చేశాడు. తాజాగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలోనూ సునీల్‌కు ఓ చక్కటి పాత్రనిచ్చాడు. అయితే ఈ పాత్రల పేర్ల విషయంలో మాత్రం మాటల మాంత్రికుడు ఎందుకో ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

హాస్యనటుడు సునీల్​

ఆ సెంటిమెంట్‌ మరేంటో కాదు.. సునీల్‌ పాత్రలు అమ్మాయిల పేర్లతో ఉండటం. 'అరవింద సమేత'లో సునీల్.. నీలాంబరి అనే పాత్రలో కనిపించగా.. 'అల వైకుంఠపురములో' చిత్రంలో సీత అనే పాత్రలో దర్శనమిచ్చాడు. సునీల్‌ను ఇలా వరుసగా అమ్మాయి పేర్లు గల పాత్రలతో చూపించడానికి వెనక ఏమైనా ఆసక్తికరమైన అంశం దాగుందా? అన్నది త్రివిక్రమ్‌కే తెలియాలి.

ABOUT THE AUTHOR

...view details