శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన తనను ముంబయి తిరిగి రావొద్దని బెదరించినట్లు ఆరోపించింది. ఈ విషయమై ట్వీట్ చేసిందీ నటి.
"శివసేన నాయకుడు సంజయ్ రౌత్.. నన్ను ముంబయికి రావొద్దంటూ బహిరంగంగానే బెదరింపులకు పాల్పడుతున్నారు. వీధుల్లో ఆజాదీల గ్రాఫిటీస్, ఇపుడు నగరానికి నన్నేమో రావొద్దని బెదిరింపులు.. అసలు ఎందుకు ముంబయి.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లా అనిపిస్తోందీ.?"