కొన్ని చిత్రాలు ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిపోతుంటాయి. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇది సహజం. నూతన నటీనటులు, దర్శకుల విషయంలో అయితే,సినీ ప్రియులు అంతగా ఆసక్తి చూపరు. అగ్ర హీరోలు-దర్శకుల కాంబినేషన్లో అయితే, సినిమా ప్రకటించినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఫాలో అవుతూనే ఉంటారు. ఇలాంటి చిత్రాలు నిలిచిపోతే ఎందుకా? అని చర్చలు పెడతారు. రామ్ చరణ్, కొరటాల శివ మొదలుపెట్టిన ప్రాజెక్టు విషయంలో ఇదే జరిగింది.
తొలి చిత్రం 'మిర్చి' తర్వాత కొరటాల.. చరణ్‌తో ఓ చిత్రం ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అప్పట్లో అది హాట్ టాపిక్. అయితే ఎందుకు ఆగిపోయింది? శివ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ శివకు స్క్రిప్ట్ విషయంలో నమ్మకం ఏర్పడటం లేదు. ఏదో చిన్న సందేహం. ఎన్నిసార్లు మార్పు చేసినా అనుకున్నట్లు రావట్లేదు. ఇస్తే బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇవ్వాలి, అంతేకాని తొందరపడి సినిమా ప్రకటించామని, ఏదో తీసేయడం బావుండదనుకున్నాడట శివ. ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పాడు.