బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపతున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ముందు కొన్ని విచిత్రమైన ఘటనలు జరిగాయట. వాటి గురించి ఈ మధ్య ఓ ముఖాముఖిలో కరీనా ముచ్చటించింది.
"నేను అప్పుడు 'టషాన్' చిత్రం చేస్తున్నా. సినిమా షూటింగ్ గ్రీస్ దేశంలో జరుగుతోంది. ఓ సారి సైఫ్ నా దగ్గరకు వచ్చి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. లద్ధాఖ్లోనూ మళ్లీ పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. రెండు సార్లు అతని ప్రేమను తిరస్కరించాను. నాకు అప్పటికి అతని గురించి పెద్దగా ఏమీ తెలియదు. ముందు ఆలోచించుకొని చెప్తాను అని చెప్పా. ఆ తరువాత నేను అతనికి చెప్పాను. నా వృత్తి, వ్యకిగత జీవితం వేర్వేరుగా ఉంటాయి. పెళ్లయినా, పిల్లలు పుట్టినా నటించడం ఆపను అని చెప్పా. అప్పుడు సైఫ్ చెప్పాడు..నీ ఇష్టం, నీ మనసుకు ఏదీ నచ్చితే అదే చేయమన్నాడు."