తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిధి తమిళ్​ అందుకే నేర్చుకుంటోందా? - నిధి అగర్వాల్​ జయం రవి

లాక్​డౌన్​లో తమిళం నేర్చుకునే పనిలో పడింది హీరోయిన్​ నిధి అగర్వాల్​. ఇంగ్లీష్​ నుంచి తమిళ అర్థాలు వచ్చేలా కొన్ని పదాలను రాసి ఆ చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. కోలీవుడ్​లో ప్రస్తుతం ఆమె 'భూమి' చిత్రంలో నటిస్తోంది.

Why is Nidhi Agarwal learning Tamil?
నిధి అగర్వాల్​ తమిళ్​ అందుకే నేర్చుకుంటుందా?

By

Published : May 12, 2020, 8:42 PM IST

తెలుగులో 'సవ్యసాచి', 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రాలతో కుర్రకారు మదిని దోచిన అందాల భామ నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తమిళంలో జయం రవి సరసన 'భూమి' అనే సినిమా చేస్తోంది. అయితే ఈ చిత్రం కోసం ఏకంగా తమిళ భాషను నేర్చుకునే పనిలో ఉంది నిధి. తాజాగా ఓ పేపర్‌పై ఇంగ్లీష్‌లో కొన్ని పదాలను రాసుకొని వాటికి తమిళంలో సరైన అర్ధాలు రాసుకొంటూ నేర్చుకుంటోంది.

"కొత్త భాష నేర్చుకోవడం.. ఇది మీరు గుర్తుపట్టగలరా" అంటూ ట్విట్టర్​లో పోస్ట్​ పెట్టింది. మరో ట్వీట్‌లో.."నాకు తెలుగు అబ్బాయిలు బాగా తెలుసు.. నాకు చాలా బాగా తెలుగు వస్తోంది.." అంటూ పోస్ట్‌ పెట్టింది. 'భూమి' చిత్రం గురించి నిధి మాట్లాడుతూ.."నేను నా పాత్ర గురించి పెద్దగా చెప్పదలచుకోలేదు. కానీ ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో నటిస్తున్నాని చెప్పగలను" అని తెలిపింది.

లక్ష్మణ్‌ దర్శకత్వంలో జయం రవి నటిస్తున్న తన ఇరవై ఐదో చిత్రం 'భూమి'. ఇందులో రోనిత్‌ రాయ్, సతీష్‌ తంబి రామయ్య, రాధా రవి, శరణ్య పొన్నన్‌ తదితరులు నటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది.

ఇదీ చూడండి.. బాలీవుడ్​ బ్యూటీ తాప్సీకి కాబోయే భర్త అతడే

ABOUT THE AUTHOR

...view details