తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే పాస్టర్‌గా మారాల్సి వచ్చింది: రాజా - ఆలితో సరదాగా నటుడు రాజా

'ఆలీతో సరదాగా' సెలబ్రిటీ టాక్​ షోకు హాజరైన నటుడు రాజా.. అమీర్​పేట్​లోని ఓ స్టార్​ హోటల్​లో రిసెప్షనిస్ట్​గా పనిచేసినట్లు తెలిపారు. దీంతో పాటు తాను ఎందుకు పాస్టర్​గా మారాల్సి వచ్చిందో చెప్పారు.

raja
రాజా

By

Published : Dec 15, 2020, 12:00 PM IST

ఒకప్పుడు స్టార్​ హీరోగా వెలుగొందిన రాజా.. ప్రస్తుతం చిత్రసీమలో కనుమరుగయ్యారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆయన.. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను, బాధలు, పాస్టర్​ ఎందుకు అయ్యారు సహ మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

షోలో భాగంగా 'కథానాయకుడిగా చిత్రాలతో బిజీగా ఉండి ఒక్కసారిగా పాస్టర్ ఎందుకు అయ్యారు?' అని ఆలీ అడగ్గా.. 'సినిమాలపై ఆసక్తి కోల్పోయాను. అనుకోకుండా అలా జరిగింది' అని రాజా చెప్పారు. అలాగే 'మీరు రిసెప్షనిస్ట్‌గా పని చేశారా?' అని ప్రశ్నించగా.. 'అవును, నేను ఇక్కడే గ్రీన్‌ పార్క్‌లో పనిచేశాను' అని బదులిచ్చారు. "మగాడిగా ఏదో ఒకటి చేయాలి. నాకు ఇద్దరు అక్కలు. వారికి ఆర్ధికంగా అండగా నిలవాలనుకునే ఉద్దేశంతోనే చదువుకుంటూనే పనిచేశా. అయినా మగాడిగా పుట్టాక సంపాదించాలి" అని అన్నారు.

ఇదీ చూడండి : న్యూ ఇయర్​కు రష్మిక ర్యాప్​ సాంగ్​

ABOUT THE AUTHOR

...view details