తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ పేరెందుకు మార్చుకున్నాడో తెలుసా..? - వరల్డ్​ ఫేమస్​ లవర్ 2020

రౌడీ హీరో​ విజయ్​దేవరకొండకు యువతలో ఫుల్​క్రేజ్​ ఉంది. తనదైన నటన, స్టైల్​తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరల్డ్​ ఫేమస్​ లవర్​ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే​ తాజాగా విజయ్ తన పేరు మార్చుకున్నాడు. అందుకు కారణాలేంటో ఓసారి చూద్దామా..

Why Arjun Reddy fame  Vijay Devarakonda Changed His Name in World Famous Lover(WFL)2020
http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/04-January-2020/5594006_808_5594006_1578146175518.png

By

Published : Jan 4, 2020, 7:55 PM IST

2011లోనే తెరంగేట్రం చేసిన విజయ్​ దేవరకొండ, 2016లో పెళ్లి చూపులు సినిమాతో మంచి ఫేం​ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'అర్జున్​ రెడ్డి' సినిమాతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టి టాప్​ హీరో అయ్యాడు. అయితే ఈ సినిమా భారీ విజయం తర్వాత ఏ మంత్రం వేశావే, నోటా, ద్వారక సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. టాక్సీవాలా, డియర్​ కామ్రేడ్​ లాంటి చిత్రాలు కలెక్షన్లు రాబట్టినా... భారీ హిట్ జాబితాలో నిలవలేదు. అందుకే తన కొత్త సినిమా వరల్డ్​ ఫేమస్​ లవర్​ కోసం పేరు మార్చుకున్నాడా అనేది ఓ టాక్​ వినిపిస్తోంది.

వరల్డ్​ ఫేమస్​ లవర్​లో విజయ్​దేవరకొండ

గతేడాదే ఈ సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. అప్పటి నుంచి పలు పోస్టర్​లు విడుదల చేసింది చిత్రబృందం. అన్నింటిలో విజయ్​ దేవరకొండ అనే ఉంది. అయితే కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత వచ్చిన టీజర్​లో మాత్రం పేరు మారింది. ఈ ఏడాది కలిసిరావాలంటే ఈ మార్పులు ఎవరైనా సూచించారా అనేది మరో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం విజయ్ దేవరకొండ​...'దేవరకొండ విజయ్‌ సాయి'గా మారిపోయాడు.

నలుగురు కథానాయికలతో విజయ్​

'మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ కథానాయికలు. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు.

రాశీఖన్నా... యామినా...!

అర్జున్​రెడ్డి లాంటి బోల్డ్​ కథాంశంతో వస్తోన్న వరల్డ్​ ఫేమస్​ లవర్​ చిత్రం టీజర్​ ఇటీవలే విడుదలైంది. "ప్రేమంటే రాజీ గౌతమ్‌.. ప్రేమంటే త్యాగం.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావు.." అని ఓ అమ్మాయి అంటున్న డైలాగ్‌తో వీడియో ఆరంభమైంది. ఇందులో విజయ్‌ నలుగురు కథానాయికలు రాశీ, ఐశ్వర్య, కేథరిన్‌, ఇజబెల్లెతో మంచి కెమిస్ట్రీ పండించాడు. కొన్ని సన్నివేశాల్లో మరో 'అర్జున్‌ రెడ్డి' గుర్తొచ్చాడు. టీజర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. అయితే టీజర్​ ఆఖర్లో బోల్డ్​ డైలాగ్​ను వినిపించాడు. అందులో విజయ్​ 'యామిని' అని పలికిన పాత్ర పేరు ఎవరనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. తాజాగా రౌడీహీరో పాత ట్వీట్​ ఆ ప్రశ్నకు సమాధానంగా మారింది. రాశీ ఖన్నా పాత్ర పేరే యామిని అని గతంలో ట్వీట్ చేశాడు రౌడీ హీరో. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

రాశీఖన్నా... యామిని అంటూ విజయ్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details