జాన్వీ కపూర్.. స్టార్ కిడ్‌గా పుట్టిన ఈ భామ బాలీవుడ్లో అరంగేట్రం చేస్తూనే సంచలన విజయం నమోదు చేసింది. తొలి సినిమా 'ధడక్'తో దాదాపు 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటికి మూడు చిత్రాల్లోనే వెండితెరపై అలరించినా.. తనదైన అందంతో నెట్టింట మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తల్లి బాటలోనే సినిమాల్లో రాణించేందుకు విభిన్న కథలు, నాయికా ప్రాధాన్య చిత్రాలను ఎంచుకుంటోంది. అయితే తన కూతురు జాన్వీ సినిమాల్లోకి రావడం స్వర్గీయ శ్రీదేవికి ఇష్టం లేదట. ఈ విషయాన్ని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.
"నేను సినిమాల్లోకి వస్తానంటే అమ్మ ఒప్పుకోలేదు. నా నిర్ణయం మార్చుకోమని సూచించింది. అయితే నేను చాలాసార్లు నచ్చజెప్పి, ఒప్పిస్తే ఆఖరికి అంగీకరించింది. అందుకు చాలారోజులు కష్టపడ్డా. మేము తనలా కష్టపడకూడదని అనుకునేది. తను పనిచేసిన సినిమా ఇండస్ట్రీలోకి నేను రాకూడదని కోరుకునేది. అందుకే మొదట ఒప్పుకోలేదు"
-జాన్వీ కపూర్, బాలీవుడ్ నటి