బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఆలియా భట్‌పై మరోసారి విరుచకుపడింది. తాజాగా ఆలియా చిన్నప్పటి ఫొటోకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాల్య చిత్రాన్ని జోడించి ట్విట్టర్ వేదికగా పంచుకుంది. వీరిలో ఎవరు క్యూట్‌గా ఉన్నారో చెప్పండి చూద్దాం? అంటూ పేర్కొంది.
'సుశాంత్, ఆలియా.. వీరిలో ఎవరు క్యూట్?' - sushant singh rajput childhood pic
ఇటీవలే బాలీవుడ్ నటి ఆలియా భట్ చిన్నప్పటి ఫొటోకు ప్రముఖ సెలెబ్రిటీల నుంచి లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అయితే, కంగనా రనౌత్ ఈ విషయంపై ట్వీట్ చేసింది. సుశాంత్ బాల్య చిత్రానికి అతని సోదరి చేసిన పోస్ట్‌కు.. ఎందుకు స్పందించలేదంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇటీవలే ఆలియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తన ఫొటోకు.. మిలియన్ లైక్‌లతో పాటు ప్రముఖ సెలెబ్రిటీలు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, హృతిక్ రోషన్ తదితరులు ఆలియా చిత్రంపై ప్రేమపూర్వక కామెంట్లు చేశారు. అయితే కంగనా దీనిపై స్పందిస్తూ.. సుషాంత్ ఫొటోపై, అతని సోదరి చేసిన పోస్ట్‌పై ఎవరూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది.
"సుశాంత్ సోదరి ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. మరి ఈ మాఫియా మాయగాళ్లు ఫొటోకి లైక్, కామెంట్ ఏదీ చేయలేదు. ఎందుకు?. అతను చిన్నతనంలో అందంగా లేడా? సుశాంత్ ఎంతో ప్రతిభావంతుడు.. మంచి నటుడు కూడా. సరే.. ఎవరు క్యూట్‌గా ఉన్నారో ఇప్పుడే తేలుద్దాం. పదో తరగతి ఫెయిల్ అయిన ఆలియా భట్ ఒకవైపు. ఫిజిక్స్‌లో ఒలంపియాడ్ విన్నర్ సుశాంత్ మరోవైపు. ఇప్పుడు ఈ ప్రముఖలు ఎవర్ని ఇష్టపడతారో చూద్దాం" అంటూ కంగనా పేర్కొంది.