తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భారీ ధరకు 'దర్బార్​' హక్కులు.. 'తలైవా' డబుల్​ సెంచరీ - భారీ ధరకు దర్బార్ హక్కులు

సూపర్​స్టార్ రజనీకాంత్​ 'దర్బార్' ప్రీరిలీజ్​ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని సమాచారం. సినిమా హక్కులు.. దాదాపు రూ.221 కోట్లకు అమ్ముడుపోయావని టాక్.

భారీ ధరకు 'దర్బార్​' హక్కులు.. 'తలైవా' డబుల్​ సెంచరీ
'దర్బార్​'లో సూపర్​స్టార్ రజనీకాంత్

By

Published : Jan 5, 2020, 6:05 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. 'దర్బార్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందుకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు.. దాదాపు రూ.221 కోట్లకు అమ్ముడుపోయావని సమాచారం. ఈ విషయంతో 'తలైవా'.. అప్పుడే డబుల్​ సెంచరీ కొట్టేశాడని అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

దర్బార్​లో సూపర్​స్టార్ రజనీకాంత్-నయనతార
'దర్బార్​'లో సూపర్​స్టార్ రజనీకాంత్

ఇందులో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు రజనీ. నయనతార హీరోయిన్. సునీల్​శెట్టి విలన్.​ నివేదా థామస్.. రజనీ కూతురిగా కనిపించనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.​

ఇది చదవండి: ట్రాన్స్​జెండర్​ పాత్ర చేయాలనుకుంటున్న రజనీకాంత్

ABOUT THE AUTHOR

...view details