అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ ఒప్పుకొన్న వరుస చిత్రాల్లో 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ ఒకటి. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించే బాధ్యతని యువ దర్శకుడు సాగర్ చంద్రకి అప్పజెప్పారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో మరో కథానాయకుడికీ చోటుంది. మరి ఆ పాత్రలో నటించేది ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పవన్‌తో కలిసి నటించే మరో హీరో ఎవరు? - కన్నడ నటుడు సుదీప్
మలయాళీ హిట్ చిత్రం..'అయ్యప్పనుమ్ కోశియుమ్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నారు పవన్ కల్యాణ్. మరి ఇందులో పవర్‌స్టార్‌తో పాటుగా నటించే మరో కథానాయకుడెవరు?
పవన్‌తో కలిసి నటించే మరో కథానాయకుడెవరు?
యువ కథానాయకుడు రానా దగ్గుబాటితో పాటు, కన్నడ నటుడు సుదీప్ పేర్లు వినిపించాయి. తాజాగా తమిళ నటుడు విజయ్‌సేతుపతితోనూ చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కథానాయిక ఎంపికపైనా చిత్రబృందం కసరత్తులు జరుపుతోంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రంతో బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి:700 కోట్ల వీక్షణలు సాధించిన వీడియో ఇదే