లాక్‌డౌన్ వేళ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికీ జుత్తు కత్తిరించుకోవడం ఓ పెద్ద ప్రహసనంగా మారింది. కొంతమంది తారలు తమ కుటుంబ సభ్యుల సాయంతో హెయిర్ కట్ చేసుకుంటూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఆలియా భట్.. ఇటీవల జుత్తు కత్తిరించుకుందట. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పొట్టి జుత్తుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. అయితే తనకు జుత్తు కత్తిరించింది ఎవరన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది ఆలియా.
ఆలియా చెప్పిన ప్రియమైన వ్యక్తి ఎవరు? - అలియా భట్ కొత్త హెయిర్ స్టైల్
ఇంట్లోనే హెయిర్‌కట్ చేసిన తన ప్రియమైన వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ధన్యవాదాలు తెలిపింది బాలీవుడ్ నటి ఆలియా భట్. అయితే తనకు జత్తు కత్తిరించింది ఎవరనేది స్పష్టత ఇవ్వలేదు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.
ఆలియా భట్ చెప్పిన ప్రియమైన వ్యక్తి ఎవరు?
"ఇంట్లోనే హెయిర్ కట్ చేసుకున్నా. ఆ విషయంలో నాకు సహకరించిన నా ప్రియమైన బహుముఖ ప్రజ్ఞాశాలికి ధన్యవాదాలు" అని ఆలియా రాసిన వ్యాఖ్య అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఆ ప్రియమైన వ్యక్తి ఎవరో అంటూ కామెంట్లలో ఆరా తీస్తున్నారు. అది కచ్చితంగా ఆలియా ప్రియుడు రణ్‌బీర్ కపూరే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌లో కసరత్తులతో మరింత ఫిట్‌గా మారానని చెబుతోంది ఆలియా.
ఇదీ చూడండి.. స్క్రిప్ట్ రెడీ.. షూటింగ్ చేయడమే ఆలస్యం!