తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​కు వాటర్ ట్యాప్​ అని పేరు పెట్టిన టాప్ డైరెక్టర్​! - సదా

మనలో చాలా మందికి ముద్దు పేర్లుంటాయి. మనల్ని ఆటపట్టించేందుకూ కొన్ని పేర్లుంటాయి. అలా అందాల భామ శ్రద్ధా దాస్​ను వాటర్​ ట్యాప్​ అని పిలిచేవారట. ఆ పేరు పెట్టింది ఓ ప్రముఖ దర్శకుడు. ఆయన పేరును ఇటీవలే క్యాష్​ ప్రోగ్రామ్​కు వచ్చిన సందర్భంగా వెల్లడించింది శ్రద్ధా.

shraddha das
శ్రద్ధా దాస్

By

Published : Sep 1, 2021, 8:26 AM IST

ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్​ను వాటర్​ ట్యాప్​ అని ఆటపట్టించేవారట ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధానే వెల్లడించింది. ఈటీవీలో ప్రతి శనివారం వచ్చే క్యాష్​ ప్రోగ్రామ్​లో యాంకర్​ సుమతో సరదా సంభాషణలో తనను ఎందుకు అలా పిలిచేవారో చెప్పింది.

శ్రద్ధా

"ఆర్య 2 చిత్రీకరణ సమయంలో దర్శకుడు సుకుమార్ నాకు ఆ పేరు (వాటర్​ ట్యాప్​) పెట్టారు. షూటింగ్​లో ఉన్నప్పడే ఎవరైనా ఏమైనా అంటే నాకు వెంటనే ఏడుపొచ్చేస్తుంది. కళ్లలోంచి నీరు కారిపోతూనే ఉంటుంది. దీంతో అందరూ నన్ను వాటర్​ ట్యాప్​ ఆటపట్టించేవారు."

-శ్రద్ధా దాస్, నటి

నటి శ్రద్ధా దాస్

ఆర్య 2లో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ సహా కాజల్, నవదీప్​, శ్రద్ధా దాస్ నటించారు. బన్నీని ప్రేమించే అమ్మాయి పాత్రలో నటించింది శ్రద్ధా.

సుమతో శ్రద్ధా

సెప్టెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ఈ ప్రోగ్రామ్​ ప్రసారం కానుంది. శ్రద్ధాతో పాటు ఈ కార్యక్రమంలో అలనాటి అందాల భామలు రాశి, మహేశ్వరి, సదా పాల్గొన్నారు. వారితో సుమ చేసిన అల్లరి ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

ఇదీ చూడండి:Telugu serial actress: హీరోయిన్ల కంటే ఈ సీరియల్​ స్టార్స్ చాలా ఫేమస్!

ABOUT THE AUTHOR

...view details