తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్​ అభిమాన నటుడెవరో తెలుసా..? - రణ్​బీర్​ కపూర్​

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​కు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్​ ఉంది. ఎందరో యువ కథానాయకులు అతడిని స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ అలాంటి స్టార్​ హీరోనే ఓ యువ కథానాయకుడి నటన మెప్పించిందట. అందుకే ఆ యంగ్​హీరో తన అభిమాన నటుడని చెప్తూ ట్వీట్​ చేశాడు బిగ్​బీ.

who is favourite Actor of Amithb bachhan
అమితాబ్​ అభిమాన నటుడెవరో తెలుసా..!

By

Published : Feb 27, 2020, 8:35 AM IST

Updated : Mar 2, 2020, 5:23 PM IST

చిత్ర పరిశ్రమలో ఎందరో ప్రముఖ నటులకు స్ఫూర్తి అమితాబ్‌బచ్చన్‌. అభిమానుల్ని పక్కన పెడితే అతడ్ని ఫాలో అయ్యే నటులే చాలామంది ఉన్నారు. అలాంటి అమితాబ్​.. యువ కథానాయకుడు రణ్​బీర్​ కపూర్​ నటనను ఇష్టపడతాడట. అందుకే తన అభిమాన నటుల్లో రణ్​బీర్​ ఒకడని కితాబిచ్చాడు బిగ్​ బచ్చన్​. ఈ విషయాన్నితాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడీ బాలీవుడ్​ మెగాస్టార్​.

అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్​ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణకు జరపుకొంటోంది. తాజాగా సెట్​లో తీసుకున్న ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నాడు బిగ్​బీ.

'బ్రహ్మాస్త్ర' చిత్రీకరణలో రణ్​బీర్​ కపూర్​, అమితాబ్​ బచ్చన్​

"నేను అభిమానించే నటుల్లో ఒకడు రణ్‌బీర్‌. అతడి ప్రతిభను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా" అని పోస్ట్‌ చేశాడు అమితాబ్‌. ఆలియాభట్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, మౌనీరాయ్‌ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనుల వల్ల సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందని చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. అయితే డిసెంబర్​ 4న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. మెగా పవర్​స్టార్​తో 'భీష్మ' దర్శకుడి తర్వాతి చిత్రం!

Last Updated : Mar 2, 2020, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details