వెబ్ సిరీస్‌లు హవా నడుస్తున్న ఈ కాలంలో పట్టుమని గంటసేపు సినిమా చూడాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు నెటిజన్లు. అలాంటిది దాదాపు నాలుగున్న గంటల నిడివితో సినిమాలను గతంలో తీశారు. ప్రేక్షకుల వాటిని ఆదరించారు కూడా. అవి మనదేశంలో రూపొందిన భారీ నిడివి గల చిత్రాలుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి.
అమ్మో.. అంత పెద్ద సినిమాలు తీశారా?
మన దేశంలో అత్యంత ఎక్కువ నిడివి గల చిత్రాలేంటి? అవి ఎప్పుడు వచ్చాయి? అందులో ఎవరెవరు నటించారు? లాంటి ఆసక్తికర అంశాలే ఈ కథనం.
అమ్మో అంత పెద్ద సినిమాలు తీశారా?
దిగ్గజ రాజ్‌కపూర్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన 'మేరా నామ్ జోకర్'. జేపీ దత్తా దర్శకత్వం వహించిన 'ఎల్ఓసీ కార్గిల్' సినిమాలు రెండూ దాదాపుగా నాలుగన్నర గంటల నిడివితో తెరకెక్కించారు. వీటిలో 'మేరా నామ్ జోకర్'.. 1970 డిసెంబరు 18న విడుదలవగా, 'ఎల్ఓసీ కార్గిల్'.. 2003 డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని సొంతం చేసుకోవడం మరో విశేషం.