తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన చిత్రం 'మాస్టర్'. ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ 65వ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు. సినిమా కోసం ముగ్గురు కథానాయికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో కియారా అడ్వాణీ, రష్మిక మందన, పూజా హెగ్డే. అయితే ఈ ముగ్గురిలో విజయ్‌తో కలిసి ఎవరు ఆడిపాడనున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ఆ ముగ్గురిలో విజయ్‌తో నటించేదెవరు? - విజయ్ సినిమాలో పూజా హెగ్డే
దళపతి విజయ్ ప్రధానపాత్రలో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికచేసేందుకు చిత్రబృందం ముగ్గురు తారలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆ ముగ్గురిలో విజయ్ సరసన నటించేదెవరు?
ఈ చిత్రానికి 'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్ అన్బు - అరివులు యాక్షన్ పార్ట్‌ను కొరియాగ్రాఫ్ చేయనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీలో చిత్రం కనువిందు చేయనుంది. దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రంమైన 'కోలమావు కోకిలా'తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషించింది.
ఇదీ చూడండి:ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత సరికొత్త రికార్డు