తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​' తర్వాత ఎన్టీఆర్​​తో ఏ దర్శకుడికి ఛాన్స్..!​ - ఆర్​ఆర్​ఆర్​

ఆర్​ఆర్​ఆర్​ చిత్రం తర్వాత ఎన్టీఆర్​ ఏ దర్శకుడితో సినిమాను పట్టాలెక్కిస్తాడన్న విషయంపై చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. తారక్​ కోసం నలుగురు టాప్​ డైరెక్టర్లు వరుసలో ఉన్నారని సీనీవర్గాలు చెబుతున్నాయి.

which director will get chance to direct NTR next movie?
'ఆర్​ఆర్​ఆర్​' తర్వాత ఎన్టీఆర్​​తో ఏ దర్శకుడికి ఛాన్స్..!​

By

Published : Dec 31, 2019, 6:31 AM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'.ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా జూనియర్​ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని చిత్ర బృందం ప్రకటించింది. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత తారక్​ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆ వరుసలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పేరు ముందుంది. త్రివిక్రమ్‌ ఓ కుటుంబ కథను సిద్ధం చేస్తున్నాడని.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తరువాత తారక్‌ ఈ సినిమాలోనే నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. గతేడాది వీరిద్దరి కలయికలో 'అరవింద సమేత' తెరమీదకొచ్చింది.

'ఆర్​ఆర్​ఆర్​' తర్వాత ఎన్టీఆర్​​తో ఏ దర్శకుడికి ఛాన్స్..!​

మరోవైపు 'కేజీయఫ్‌' దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో ఎన్​టీఆర్​ సినిమా చేయబోతున్నట్టు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నీల్‌ తారక్‌కు కథ కూడా వినిపించేశాడట. తమిళ దర్శకుడు అట్లి కూడా తారక్‌తో సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు వినికిడి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ కూడా వచ్చి చేరాడు.

అయితే ఇప్పటి వరకు తారక్‌ నటించబోయే తర్వాతి సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ దర్శకులంతా తారక నామస్మరణే చేస్తున్నారు. మరి వీరిలో ఎవరికి అవకాశం ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే. 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా విడుదల తరువాతే తారక్‌ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్​ఆర్​ఆర్​లోని కథానాయకుల ఫస్ట్‌ లుక్‌ని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేసే అవకాశాలున్నాయి.వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:- 'గత 18 ఏళ్లలో ఐదు రోజులే సెలవు తీసుకున్నా'

ABOUT THE AUTHOR

...view details