తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ సింగ్.. సూపర్​స్టార్స్​కు వీరాభిమాని! - సుశాంత్ సింగ్ కంగనా రనౌత్

'దిల్​ బెచారా' చిత్రీకరణలో సుశాంత్ చేసిన అల్లరికి సంబంధించిన వీడియోను దర్శకుడు ముకేశ్ ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సుశాంత్ సింగ్.. సూపర్​స్టార్స్​కు వీరాభిమాని!
సుశాంత్ సింగ్

By

Published : Jul 24, 2020, 11:34 AM IST

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్​ బెచారా' నేడు(జులై 24) ఓటీటీలో విడుదల కానుంది. సాయంత్రం 7:30 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సెట్స్​లో సుశాంత్​ అల్లరికి సంబంధించిన విశేషాలతో రూపొందిన వీడియోను దర్శకుడు ముకేశ్ చబ్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతడితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. సుశాంత్​ను 'హీరో' అని అభివర్ణించారు.

'దిల్​ బెచారా' షూటింగ్​ జరుగుతున్న సమయంలో తామిద్దరం(సుశాంత్, ముఖేశ్) సినిమాల గురించి చాలా మాట్లాడుకునేవాళ్లమని చెప్పిన ముకేశ్.. యాక్షన్​లో ఉంటే సూపర్​స్టార్ రజనీకాంత్​కు, కట్​ చెబితే షారుక్​ ఖాన్​కు సుశాంత్ వీరాభిమాని అని వెల్లడించారు. జంషెడ్​పుర్​లో చిత్రీకరణ సందర్భంగా రోడ్డుపైనే షారుక్​ పాటలకు సుశాంత్ డ్యాన్స్​ చేసినట్లు తెలిపారు. ఈ వీడియోలో దానిని చూడొచ్చు.

'దిల్​ బెచారా'లో సుశాంత్ సింగ్, సంజనా సంఘీ

'దిల్​ బెచారా'లో సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించారు. 2014లో వచ్చిన హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌'కు రీమేక్‌ ఇది. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో సినిమాను రూపొందించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించారు.

ABOUT THE AUTHOR

...view details