షారుక్ ఖాన్ తర్వాత సినిమా ఏంటి? అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇతడి గత చిత్రం 'జీరో' భారీ అంచనాల మధ్య వచ్చి విఫలమైంది. ఈ కారణంగా తన తర్వాతి ప్రాజెక్టు గురించి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్‌కుమార్ హిరాణీ, అట్లీ, రాజ్ - డీకే, అలీ అబ్బాస్ జాఫర్.. ఇలా దర్శకుల జాబితా పెద్దదే ఉంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి కరణ్ జోహార్ పేరు చేరింది.
బాలీవుడ్ బాద్షా తర్వాతి సినిమా ఏంటి? - షారుఖ్ ఖాన్ కొత్త సినిమా
షారుక్‌ఖాన్ తర్వాతి సినిమా ఎప్పుడా? అని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 'జీరో' విఫలం కావడం వల్ల తర్వాతి చిత్రం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో ఉంటుందో చూడాలి.
బాలీవుడ్ బాద్షా తర్వాత సినిమా ఏంటి..?
షారుక్ప్రస్తుతానికి ప్రయోగాలు చేయడానికి కొంచెం విరామం ఇచ్చారు. పూర్తిస్థాయి వాణిజ్య చిత్రం చేయాలనుకుంటున్నారు. కరణ్ కూడాషారుక్తో మాస్ మసాలా సినిమా చేయాలనుకుంటున్నారు. అది త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని కరణ్ సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. హిరాణీ దర్శకత్వంలో షారుక్ నటించబోయే చిత్రంలో కరీనా నటించనుందని వార్తలొస్తున్నాయి.
Last Updated : Feb 17, 2020, 8:06 PM IST