తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగ్రవాది పాత్ర కోసం చాలా కష్టపడ్డా: సమంత - రాజ్​ అండ్​ డీకే

స్టార్​ హీరోయిన్​ సమంత నటించిన తొలి వెబ్​సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్​ 4న అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇందులో సామ్​ ఓ ఉగ్రవాది పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రలో నటించేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి.. ఎంతో హోమ్​వర్క్​ చేశానని సమంత చెబుతోంది.

When Samantha Akkineni went into 'dark zone' and broke down on Family Man 2 sets
'ఆ పాత్ర కోసం నిద్రలేని రాత్రులు గడిపా!'

By

Published : May 21, 2021, 6:37 PM IST

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్​సిరీస్​లో అటు ఓటీటీతో పాటు ఇటు బాలీవుడ్​లోనూ ఎంట్రీ ఇవ్వనుంది స్టార్​ హీరోయిన్​ సమంత. ఇందులో సామ్ ఉగ్రవాదిగా​ డీ-గ్లామర్​ పాత్రలో నటించింది. అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్​లో సమంత నటనకు చాలా మంది సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు.

దీంతో ఈ సిరీస్​పై అటు బాలీవుడ్​తో పాటు ఇటు దక్షిణాది చిత్రసీమల్లో ఆసక్తి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెబ్​సిరీస్​ రిలీజ్​ కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్​ మొదలుపెట్టింది. ఆ ఉగ్రవాది పాత్ర కోసం ఆమె ఎంతగా కష్టపడిందో సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత

"షూటింగ్​కు వెళ్లే రెండు, మూడు రోజుల పాటు నేను నిద్ర పట్టని పాత్ర అయితేనే నటించేందుకు అంగీకరించాలని అప్పటివరకు భావించా. ఈ వెబ్​సిరీస్​లోని పాత్ర కోసం అదే విధంగా నిద్రలేని రాత్రులు గడిపాను. ముఖ్యంగా ఇందులో నా పాత్ర. యాధార్థ సంఘటనల నుంచి ప్రేరణగా ఆ పాత్ర పుట్టిందని దర్శకులు రాజ్​, డీకే చెప్పిన తర్వాత.. దానికి నేను కచ్చితంగా న్యాయం చేయాలని ఆశించాను. ఈ పాత్ర కోసం నిజజీవిత వీడియో క్లిప్స్​ తీసుకొని.. చాలా లోతుగా పరిశీలించాను. అదే విధంగా చాలా హోమ్​వర్క్​ చేశాను".

- సమంత అక్కినేని, హీరోయిన్​

'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​లో ఉగ్రవాది పాత్ర కోసం సమంత ఏ విధంగా కష్టపడిందో దర్శకులు రాజ్​, డీకే వెల్లడించారు. "ఈ పాత్ర కోసం సమంత పూర్తిగా చీకటి లోకంలోకి వెళ్లిపోయింది. అందుకోసం ఓ హృదయవిదారకమైన డాక్యుమెంటరీని క్షుణ్ణంగా పరిశీలించింది. షూటింగ్​ ప్రారంభించిన తొలి మూడు రోజుల్లో ఆమె సరిగా ఏకాగ్రత పెట్టలేకపోయింది. కానీ, ఆ తర్వాత రోజున ఆమె ఓ సన్నివేశం​లో నటించి.. అది పూర్తైన తర్వాత ఎలా వచ్చింది అని అడిగింది. మాకు కావాల్సింది ఇదేనని చెప్పిన తర్వాత ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆమె నటన వెనకున్న రహస్యం ఆ పాత్ర కోసం సామ్​ తగినంత హోమ్​వర్క్​ చేయడమే!" అని దర్శకులు రాజ్​, డీకే అన్నారు.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత
'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధానపాత్రలు పోషించిన ఈ సిరీస్‌ మొదటి భాగం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ నటన విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌ అందించిన విజయోత్సాహంతో 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్‌ 2ను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్‌, డీకే. ఇందులో అదనపు ఆకర్షణగా కథానాయిక సమంత నటించారు. జూన్​ 4న అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానుంది.

ఇదీ చూడండి..'ఫ్యామిలీ మ్యాన్​ 2' ట్రైలర్​ రిలీజ్​కు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details