బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వేల్ షార్క్‌తో కలిసి ఈత కొట్టింది. అదేంటి లాక్డౌన్ కదా ఎప్పుడు, ఎక్కడ అని అనుకుంటున్నారా? మరేం లేదు, ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా త్రోబ్యాక్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కత్రినా.. వేల్ చేప తనకు మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఫ్రెండ్ అంటూ రాసుకొచ్చింది. దీనికి అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.
షార్క్‌తో స్విమ్మింగ్ చేసిన కత్రినా కైఫ్ - షార్కుతో కత్రినా కైఫ్ స్విమ్మింగ్
స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకొంది. ఇందులో వేల్ షార్క్‌తో ఈత కొడుతూ కనిపించిందీ భామ. ఇది అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
షార్కుతో కలిసి కత్రినా స్విమ్మింగ్!
లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ వంటచేయడం, అంట్లు తోమడం సహా చాలా పనులు చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది కత్రినా. బాలీవుడ్లో ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'సూర్యవంశీ'లో కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి:పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఓ తల్లి వేదన