తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లికి సిద్ధమైన ఇమ్రాన్ ఖాన్, రేఖ!

పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ పెళ్లి చేసుకోవాలని భావించారట. ఇందుకు సంబంధించిన ఓ కథనం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Imran Khan, Rekha
ఇమ్రాన్ ఖాన్, రేఖ

By

Published : May 14, 2021, 7:23 AM IST

Updated : May 14, 2021, 9:18 AM IST

బాలీవుడ్‌.. క్రికెట్‌ది అవినాభావ సంబంధం! ఎందుకంటే ఎంతో మంది బాలీవుడ్‌ అందగత్తెలు టీమ్‌ఇండియా క్రికెటర్లను ప్రేమించారు. పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది.

అయితే ఇది భారత క్రికెట్‌తోనే ఆగిపోలేదు! పాక్‌ మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, బాలీవుడ్‌ అలనాటి ముద్దుగుమ్మ రేఖ పెళ్లి చేసుకోవాలని భావించారట! ప్రస్తుతం ఈ సమాచారంతో కూడిన ఓ కథనం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

ఒకప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ చుట్టూ ఎక్కువగా అందమైన అమ్మాయిలు ఉండేవారని ఇప్పటికీ చెబుతుంటారు. అప్పట్లో భారత్‌, పాక్‌ ఎక్కువగా ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీసులు ఆడేవి. పాక్‌ క్రికెటర్లు కూడా బాలీవుడ్‌ తారలను తరచూ కలుస్తుండేవారు. ఇమ్రాన్‌, రేఖ మాత్రం దాదాపుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వారిద్దరూ బీచ్​లు, ఉద్యానవనాల్లో ప్రేమించుకొనేవాళ్లని ఆ కథనంలో రాశారు.

అందులోనే సినీ తారలతో డేటింగ్‌ గురించి ఇమ్రాన్ అభిప్రాయం ఏమిటో ప్రచురించారు. "నటీమణులతో సహచర్యం కొన్నాళ్లే బాగుంటుంది. కొంత వరకు వారితో సాంగత్యాన్ని నేను ఆస్వాదించేవాడిని. ఆ తర్వాత ముందుకెళ్లే వాడిని. అయితే నటిని పెళ్లి చేసుకోవాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు" అని ఇమ్రాన్‌ అనడం గమనార్హం.

Last Updated : May 14, 2021, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details