దిగ్గజ సంగీత దర్శకుల ద్వయం ఆనంద్-మిలింద్.. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా డ్యాన్స్ ప్రతిభ అద్భుతమని ప్రశంసించారు. సినిమాల్లోకి రాకముందు అతడిని ఓ అర్ధరాత్రి ఆడిషన్ చేసినట్లు వెల్లడించారు. ఆ రోజు గోవిందా వేసిన నృత్యానికి ఫిదా అయినట్లు గుర్తుచేసుకున్నారు.
"మేం ఓరోజు ముంబయిలోని గోవిందా మేనమామ ఉదయ్ నారాయణ్ ఇంటికి అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటి గంట సమయంలో వెళ్లాం. అప్పుడు నటుడు కావాలనే ఉద్దేశంతో గోవిందా ముంబయి వచ్చినట్లు, డ్యాన్స్ కూడా బాగా వేస్తాడని ఉదయ్ మాకు చెప్పారు. దీంతో మేం అతడిని నిద్రలేపి ఆడిషన్ చేశాం. డ్యాన్స్ వేయాలని అన్నాం. అంత నిద్రలో ఉన్నాసరే గోవిందా, 15నిమిషాల పాటు స్టెప్పులు వేసి మమల్ని ఫిదా చేశాడు"