'రాధే'లోని ఓ ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు హీరో సల్మాన్‌ఖాన్‌ను పొరపాటున కొట్టేశానని చెప్పాడు గౌతమ్ గులాటి. ఈ సినిమాలో ప్రతినాయకుడు నటించిన ఇతడు.. అంతకు ముందు పలు చిత్రాల్లో హీరోగా చేశాడు. దీంతో దెబ్బలు తినడానికి బదులు 'రాధే'లో హీరోకు అనుకోకుండా పంచ్ ఇచ్చినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత సల్మాన్భాయ్కు సారీ చెప్పినట్లు గౌతమ్ తెలిపాడు.
షూటింగ్లో సల్మాన్‌ఖాన్‌ను కొట్టిన సహనటుడు
'రాధే' చిత్రీకరణలో భాగంగా ఓ సన్నివేశంలో సల్మాన్‌ను అనుకోకుండా కొట్టినట్లు నటుడు గౌతమ్ గులాటి వెల్లడించాడు. అనంతరం భాయ్‌కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు.
సల్మాన్‌ఖాన్
ఓటీటీలో పే పర్ వ్యూ విధానంలో 'రాధే', ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో సల్మాన్ సరసన దిశాపటానీ హీరోయిన్గా నటించింది. ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
ఇది చదవండి:'రాధే' లీక్‌పై సల్మాన్ ఫైర్
Last Updated : May 17, 2021, 7:01 PM IST