తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షారుక్ నన్ను ఐదు చిత్రాల నుంచి తప్పించాడు: ఐశ్వర్య - shahrukh veer zaara

ఎటువంటి కారణం లేకుండానే తనను పలు చిత్రాల నుంచి షారుక్​ ఖాన్(shahrukh khan aishwarya rai film)​ తప్పించినట్లు తెలిపారు ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్​. అందుకు చాలా బాధపడినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన బాద్​షా.. అలా చేసినందుకు తాను కూడా ఫీల్​ అయినట్లు వెల్లడించారు.

sharukh
షారుక్​

By

Published : Sep 21, 2021, 6:09 PM IST

Updated : Sep 21, 2021, 6:41 PM IST

షారుక్​ ఖాన్​-ఐశ్వర్యారాయ్(shahrukh khan aishwarya rai movie)​ జంటగా తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. వారిద్దరు కలిసి తెరపై పండించే కెమిస్ట్రీ అలా ఉంటుంది మరి. 'దేవదాస్​', 'జోష్'​, 'మొహబ్బతే'​ సహా పలు చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. అయితే షారుక్.. తనకు చెందిన ఐదు సినిమాల నుంచి ఐశ్వర్యను తప్పించారని మీకు తెలుసా? అందులో 'వీర్​జారా'(shahrukh veer zaara), 'చల్తేచల్తే' చిత్రాలు ఉన్నాయి. అవును ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా ఐష్​ వెల్లడించారు.

షారుక్​-ఐశ్వర్య

'షారుక్​ పలు సినిమాల నుంచి మిమ్మల్ని తీసేశారంట కదా. ఇది నిజమేనా?' అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు.. ఈ విషయం నిజమేనని ఒప్పుకున్నారు ఐశ్వర్య(shahrukh khan aishwarya rai film). "దీనికి నేను సమాధానం ఎలా చెప్పగలను? అప్పుడు మేమిద్దరం కలిసి రెండు చిత్రాల్లో నటించాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా ఏమైందో తెలీదు కానీ కారణం చెప్పకుండా నన్ను తప్పించారు. అది నన్ను ఎంతో బాధించింది. ఎందుకు వద్దనుకున్నారో అర్ధమేకాలేదు. నేను కూడా ఎందుకు ఇలా చేశారని తిరిగి అడగలేదు" అని ఐశ్వర్య చెప్పారు.

మరో ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించిన షారుక్(srk apology)​.. ఇలా చేసినందుకు ఐష్​కు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. "ఓ ప్రాజెక్ట్​ను ఒకరితో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఎటువంటి కారణాలు లేకుండా వారిని తప్పించడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా బాధేస్తుంది. ఐష్​ నాకు మంచి స్నేహితురాలు. వ్యక్తిగతంగా తన విషయంలో తప్పు చేశానని అనిపించింది. కానీ ఓ నిర్మాతగా అలా చేయాల్సి వచ్చింది. ఆమెకు క్షమాపణలు కూడా చెప్పా" అని షారుక్​ అన్నారు.

షారుక్​-ఐశ్వర్య

చివరిసారిగా షారుక్​-ఐష్​ కలిసి 2016లో విడుదలైన 'యే దిల్​ హై ముష్కిల్​'(ae dil hai mushkil film aishwarya rai) సినిమాలో నటించారు. అయితే ఇందులో బాద్​షా అతిథి పాత్ర పోషించారు.

ఇదీచూడండి: హీరోయిన్, విలన్​ రెండు ఐశ్వర్యనే!

Last Updated : Sep 21, 2021, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details