తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు నిర్ణయంపైనే ఆ విషయం ఆధారపడి ఉంది! - what will be the chiru next movie after acharya

'ఆచార్య' సినిమా తర్వాత చిరంజీవి 'లూసిఫర్'​, 'వేదాళం' రీమేక్​ సినిమాలు చేయనున్నారు. అయితే వీటిలో ముందుగా ఏ చిత్రం సెట్స్​పైకి తీసుకెళ్తారనే విషయం చిరు తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

chiru
చిరంజీవి

By

Published : Sep 6, 2020, 9:31 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్​ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్​ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ చిత్రం తర్వాత చిరు రెండు రీమేక్ చిత్రాలు చేయనున్నారు. వీటిలో ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ కాగా మరొకటి మెహర్ రమేష్​తో 'వేదాళం' రీమేక్. వీటిలో ఏ చిత్రం ముందుగా మొదలు కానుందో స్పష్టత లేదు. అయితే దీనిపై తుది నిర్ణయం చిరు మీదనే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు చిత్రాల స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.

ఇదీ చూడండి మహేశ్‌ 'సర్కారు వారి పాట'లో అనిల్ కపూర్?

ABOUT THE AUTHOR

...view details