సుకుమార్ దర్శకత్వంలో రామ్ నటించిన చిత్రం 'జగడం'. యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. కానీ రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ స్థానంలో అల్లు అర్జున్, మహేష్ బాబు ఉంటే ఎలా ఉండేది? ఎందుకంటే ముందుగా ఈ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్.. బన్నీని, మహేష్‌ని అనుకున్నాడట.
మహేశ్, బన్ని చేయాలనుకున్న పాత్రలో రామ్! - జగడం
చిత్రపరిశ్రమలో ఓ కథానాయకుడు నటించాల్సిన చిత్రం మరో హీరో చేతుల్లోకి వెళ్లడం సహజం. దానికి ఎన్నో కారణాలుంటాయి. యువ కథానాయకుడు రామ్ కెరీర్‌లో సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.
మహేశ్, బన్ని చేయాలనుకున్న పాత్రలో రామ్!
ఆ సమయంలో ఓ ప్రముఖ నిర్మాతతో విభేదాలు తలెత్తడం వల్ల వెంటనే రామ్ దగ్గరకు వెళ్లి కథ చెప్పి ఒప్పించాడట సుక్కు. కోపంలో ఉన్న దర్శకుడు.. రామ్‌కి కథ చెప్పిన మరుసటి రోజే సినిమాను లాంఛనంగా ప్రారంభించాడట. అలా బన్నీ, మహేష్ చేయాల్సిన సినిమా రామ్ చేశాడు. ఆ తర్వాత మహేష్‌తో '1 నేనొక్కడినే' తెరకెక్కించాడు సుకుమార్. బన్నీ హీరోగా వచ్చిన 'ఆర్య'తో దర్శకుడిగా పరిచయమై మరోసారి బన్నీతో 'ఆర్య 2' తీశాడు.
ఇదీ చూడండి..'స్టే హోమ్'.. సినీ ఫ్యామిలీ నుంచి మరో షార్ట్ ఫిల్మ్!