తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 5:28 PM IST

ETV Bharat / sitara

ఏంటి.. సుశాంత్ ఆ ఆఫర్ తిరస్కరించాడా?

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ మృతితో ఇండస్ట్రీలో నెపోటిజంపై చర్చలు చెలరేగిపోతున్న వేళ.. నిర్మాత అనురాగ్​ కశ్యప్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యశ్​రాజ్ ఫిలింస్​తో సినిమా చేసేందుకు తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సుశాంత్​ వదిలేసినట్లు పేర్కొన్నాడు.

What! Sushant Singh Rajput refused Anurag Kashyap's film to do YRF's project
సుశాంత్​

నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణంతో బాలీవుడ్​లో చెలరేగిన బంధుప్రీతి(నెపోటిజమ్​) చర్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సుశాంత్​కు సినిమా అవకాశాలు రాకుండా చేశారని కొంత మంది సినీ ప్రముఖులపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు ఫ్యాన్స్. అయితే, ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్​ కశ్యప్​ మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. యశ్​రాజ్​ ఫిలింస్​తో 'శుద్ధ్ దేశీ రొమాన్స్'​ సినిమా చేసేందుకు సుశాంత్​.. 'హసీ తో ఫసీ'ని తిరస్కరించిన సంఘటనను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

"ముఖేశ్​ ఛబ్రా నా కార్యాలయం నుంచే పనిచేసేవారు. 'హసీ తో ఫసీ' చిత్ర కథను తయారు చేసుకుని.. సుశాంత్​తో కలిసి సినిమా ప్రారంభించాం. అదే సమయంలో పరిణతి చోప్రా వద్దకు వెళ్లి సుశాంత్​ చిత్రం గురించి చెప్పా. ఆ తర్వాత యశ్​రాజ్ ఫిలింస్​ నుంచి సుశాంత్​కు ఓ ఆఫర్​ వచ్చింది. 'శుద్ధ్ దేశీ రొమాన్స్​' చిత్రంలో వైఆర్​ఎఫ్​ సుశాంత్​తో ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల అతడు 'హసీ తో ఫసీ' సినిమాను వదులుకున్నాడు. అలా చేసినందుకు అతనిపై ఎటువంటి కోపం లేదు. సుశాంత్​ చాలా తెలివైన వ్యక్తి. ఇప్పుడు అతని మరణాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి ఒక్కరినీ కిందికి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.'

-అనురాగ్​ కశ్యప్​, దర్శకనిర్మాత

రెండోసారి మరో సినిమా కోసం సుశాంత్​ను సంప్రదించినట్లు అనురాగ్​ తెలిపాడు. "2016లో 'ధోని: అన్​ టోల్డ్ స్టోరీ' సినిమా విడుదలకు ముందు.. నేను ఒక స్క్రిప్ట్​ రాశా. మళ్లీ ముఖేశ్​ చబ్రా సుశాంత్​ దగ్గరకు వెళ్లి.. కథ వినిపించాడు. ఆ తర్వాత ధోని విడుదలై.. సూపర్​ హిట్​ అయ్యింది. తర్వాత సుశాంత్​ తిరిగి ఫోన్​ చేయలేదు. వీటన్నింటికీ నేను అలవాటు పడ్డా." అని పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details