సినీ నటులకు హ్యాకింగ్ ఇక్కట్లు తప్పడం లేదు. కొన్ని నెలల క్రితం అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్, అద్నన్ సమీ ట్వీట్టర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ సంఘటన మర్చిపోక ముందే మరో బాలీవుడ్ నటి ఎకౌంట్ హ్యాక్ అయింది. తన అనుమతి లేకుండా తన ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని, అందులోని పోస్ట్‌లకు స్పందించవద్దని చెప్పింది కబీర్ సింగ్ హీరోయిన్ కియారా అడ్వాణీ.
"నా ట్వీట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఇది ఎలా జరిగిందో తెలుసుకునే పనిలోనే ప్రస్తుతం మేము ఉన్నాం. ఈ ఎకౌంట్ నుంచి వస్తున్న అపరిచిత ట్వీట్లను పట్టించుకోకండి. అనుమానంగా ఉన్న లింకులను క్లిక్ చేయకండి" - కియారా అడ్వాణీ, బాలీవుడ్ నటి.