తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సంజు', 'సుల్తాన్​' చిత్రాలను కాదన్న కంగనా - సంజు సినిమా

బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​.. 'సంజు', 'సుల్తాన్​' సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వాటికి సంబంధించిన తెర వెనుక జరిగిన పరిణామాలను వివరించింది.

What! Kangana rejected Sanju and Sultan
''సంజు', 'సుల్తాన్​' సినిమాల తిరస్కరణకు కారణమదేనా!'

By

Published : Mar 31, 2020, 4:54 PM IST

బాలీవుడ్​లో​ ఘన విజయం అందుకున్న సినిమాలు 'సంజు', 'సుల్తాన్​'. 'సంజు' రణ్​బీర్​కు కొత్త ఊపిరి ఇవ్వగా.. 'సుల్తాన్' బాక్సాఫీస్ వద్ద సల్మాన్ పవర్ మరోసారి చూపించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో నటించేందుకు కంగనా రనౌత్​కు అవకాశం వచ్చింది. కానీ ఈ ఆఫర్లను తిరస్కరించింది క్వీన్. అందుకు గల కారణాలను తాజాగా వెల్లడించిందీ హీరోయిన్​. కొన్ని పరిణామాల వల్ల ఆ రెండు సినిమాలకు అంగీకరించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

"రణ్​బీర్ కపూర్ ఒకరోజు​ మా ఇంటికి వచ్చి 'సంజు'​ చిత్రంలో నటించాలని కోరాడు. ఆ సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర నచ్చక ఆ ఆఫర్​ను తిరస్కరించా. ఏ హీరోయిన్​ అయినా తనతో నటించకుండా ఉంటుందా? కానీ నేను అలాంటి సినిమాలు చేయడానికి సిద్ధంగా లేనని చెప్పా. సల్మాన్​ నటించిన 'సుల్తాన్​' చిత్రాన్ని తిరస్కరించినప్పుడు దర్శకుడు ఆదిత్య చోప్రా పిలిచి 'నీతో ఇంకెప్పుడూ కలిసి పనిచేయను' అని అన్నాడు."

- కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ సినిమాల్లో ఇప్పటివరకు నటించకపోవడం విచారకరమని తెలిపింది కంగనా. 'రంగోలీ' చిత్రంలో నటించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్పింది. నటి మధుబాల బయోపిక్​లో ఆమె పాత్రను పోషించాలని ఉందని కంగనా ఇటీవలే తెలిపింది.

ఇదీ చూడండి.. కరోనాపై పోరులో మేముసైతం అంటోన్న తారలు

ABOUT THE AUTHOR

...view details