బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్... నిర్మాత కరణ్ జోహర్‌పై మరోసారి విరుచుకుపడింది. అతడికి ప్రదానం చేసిన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
అంతర్జాతీయ వేదికగా తనని బెదిరించాడని, నటుడు సుశాంత్ సింగ్‌కు వ్యతిరేకంగా కుట్రపూరిత పన్నాగాలు రచించి.. అతడి కెరీర్‌ను నాశనం చేశాడని చెప్పింది కంగన. తద్వారా సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా పరోక్షంగా ప్రేరేపించాడని ఆరోపించింది. అంతేకాదు, భద్రతా దళాలను కించపరిచేలా జాతి విద్రోహ చిత్రాన్ని నిర్మించాడని మండిపడింది.
"భారత ప్రభుత్వానికి ఇదే నా విన్నపం. దయచేసి అతడికి ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే అతడు నన్ను బెదిరించాడు. ఇండస్ట్రీ వదిలి వెళ్లమని హెచ్చరించాడు. సుశాంత్ కెరీర్ నాశనం కావడానికి అతడే కారణం. పాకిస్థాన్‌కు అనుకూలంగా మన భద్రతా దళాలను కించ పరిచేలా జాతి వ్యతిరేక చిత్రాన్ని తీశాడు" అని ట్వీట్ చేసింది కంగన. ఈ ట్వీట్ బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
కరణ్ బ్యానర్‌పై నిర్మించిన 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' చిత్రం.. సైన్యాన్ని అగౌరపరిచేవిధంగా ఉందని ఇటీవల కంగన సహా మరికొంతమంది అభిప్రాయపడ్డారు. మరోవైపు గుంజన్ సహ అధ్యాయి ఫ్లైట్ లెఫ్టినెంట్(రిటైర్డ్) శ్రీవిద్యా రాజన్ ఈ చిత్రంపై మండిపడ్డారు. తాజా చిత్రంలో నిజాలను తొక్కి పెట్టారని ఆరోపించారు. అదే విధంగా శత్రు సైనికులతో పోరాట సన్నివేశాలు కూడా నిజ జీవితంలో జరగలేదని చెప్పారు.
ఇదీ చూడండి కరణ్ జోహర్‌కు బాలీవుడ్ క్వీన్ కంగన చురకలు