తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రేడియేషన్​ సూట్'​తో తారక్​కు లింక్ ఏంటి? - MYTHRI MOVIE MAKERS NTR PRASANTH NEEL

దర్శకుడు ప్రశాంత్ నీల్.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మధ్య కాలంలో చేసిన ట్వీట్లలో జూ.ఎన్టీఆర్​కు కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారముందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇదే సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్.

'రేడియేషన్​ సూట్'​తో తారక్​కు లింక్ ఏంటి?
హీరో తారక్

By

Published : Jun 4, 2020, 8:57 PM IST

కథానాయకుడు జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ఖాయమని 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ పరోక్షంగా స్పష్టతనిచ్చేశాయి. నేడు ఈ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది మైత్రీ సంస్థ. అయితే తారక్‌ జన్మదినం రోజు ప్రశాంత్‌ చేసిన ట్వీట్​ను, ఇప్పుడు మైత్రీ ట్వీట్​ను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో చిత్ర కథకు సంబంధించి ఏదో క్లూ ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

"ఎన్టీఆర్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌. ఆయన చుట్టూ ఉన్న రేడియేషన్‌ను ఎదుర్కోవడానికి ఈసారి నేను రేడియేషన్‌ సూట్‌లో వస్తాను" అని తారక్ పుట్టినరోజున ట్వీట్ చేశారు. ప్రశాంత్‌ నీల్‌కు బర్త్​డే విషెస్ చెప్పిన మైత్రీ మూవీ మేకర్స్.. "త్వరలో రేడియేషన్‌ సూట్‌లో కలుద్దాం" అని ట్వీట్‌ చేసింది.

ఈ రెండింటిలో 'రేడియేషన్‌' పదం ఉంది. దీంతో టైటిల్‌ లేదంటే కథకు సంబంధించిన క్లూ ఏదో ఇస్తున్నారనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే సినిమా అణు ప్లాంట్‌లు, అందుకు సంబంధించిన సైంటిఫిక్‌ పరిశోధనల నేపథ్య కథతో తీయనున్నారని అనుకుంటున్నారు. మరి ఈ ట్వీట్‌ల వెనుక ఏమైనా మర్మముందా? లేక సరదాగా వాడిన పదాలేనా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళితో 'ఆర్ఆర్ఆర్', త్రివిక్రమ్‌ల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాతే ప్రశాంత్​నీల్​తో కలిసి పనిచేయనున్నాడు.

ఇది చదవండి:బాలీవుడ్​కు​ నో చెప్పి.. దక్షిణాదికి జైకొట్టి

ABOUT THE AUTHOR

...view details