'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ.. మెగా అభిమానులతో పాటు సినీప్రియుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే చిత్రబృందం ఎప్పటికప్పుడూ కొత్త పోస్టర్లను అభిమానులతో పంచుకుంటూ అంచనాల్ని రెట్టిస్తోంది. మరోవైపు వారు మాత్రం వాటిని చూస్తూ, కథకు సంబంధించిన క్లూల కోసం పరిశోధనలు ప్రారంభిస్తున్నారు. అందులోని ఓ సర్ప్రైజింగ్ విషయంపై ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
ప్రతి పోస్టర్లోనూ అల్లు అర్జున్ జేబులో ఏదో(పేపర్ లేదా కర్చీఫ్) కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే, పేపర్ అయ్యే అవకాశం లేదని అర్థమవుతోంది. కాబట్టి అదొక చేతి రుమాలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి సీన్‌లో జేబులోనే ఆ వస్తువు ఉండటానికి కారణమేంటి? అసలది హీరోకు ఎవరిచ్చారు? సినిమాలో బన్నీకి ఉన్న సెంటిమెంట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.