టాలీవుడ్ ఆణిముత్యాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' ఒకటి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన తొలి భారతీయ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. టైం మెషీన్ కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.
'ఆదిత్య 369'లో బాలకృష్ణతో కమల్ నటించాలి.. కానీ? - బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా
బాలయ్య క్లాసిక్ సినిమా 'ఆదిత్య 369'లో విశ్వనటుడు కమల్‌హాసన్ కూడా నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అందులో చేయలేకపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది?
శ్రీ కృష్ణదేవరాయ, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో బాలకృష్ణ తన నటనతో ఫిదా చేశారు. ఇలాంటి పాత్రల్లో మరో నటుడ్ని ఊహించుకోలేం కదా!. కృష్ణమోహన్‌గా కమల్ హాసన్ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు ఆయనెందుకంటారా.. ఎందుకంటే? శ్రీ కృష్ణ దేవరాయగా బాలయ్య మాత్రమే నటించగలరని, తను మాత్రమే న్యాయం చేయగలరుని ఆ పాత్రకు ఆయన్ను ఎంపిక చేశారు సింగీతం. కృష్ణ కుమార్ పాత్రకు కమల్ సరిపోతారని, ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌గా తీయాలని దర్శకనిర్మాతలు భావించారు.
అయితే అప్పటికి కమల్ మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టులో నటించడం సాధ్యం కాలేదు. దాంతో బాలకృష్ణనే రెండు పాత్రలు పోషించారు. మరి కమల్ నటించి ఉంటే ఈ అద్భుత చిత్రం ఇంకెలా ఉండేదో!