ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా(40) (Sidharth Shukla died) మరణ వార్త విని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబయిలోని ఆస్పత్రికి తీసుకురాకమునుపే సిద్దార్థ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే సిద్దార్థ్ మరణానికి గల కారణంపై వైద్యులు స్పష్టతనివ్వలేదు. శవ పరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.
సిద్ధార్థ్ మృతదేహాన్ని క్యాజువాలిటీ వార్డులో మూడుసార్లు పరీక్షించారు. సిద్దార్థ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని నిర్ధరించారు. ఇద్దరు పోలీసుల సమక్షంలో గురువారం మధ్యాహ్నం 3.45 నిమిషాలకు పోస్ట్‌మార్టం చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసినట్లు సమాచారం.
"వేకువజామున 3 గంటల ప్రాంతంలో సిద్దార్థ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాతి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తల్లికి చెప్పారు. దీంతో ఆమె తాగడానికి నీళ్లు ఇస్తే.. అవి తాగి మళ్లీ పడుకున్నారు. అయితే ఉదయం చాలా సమయం అయినా సిద్దార్థ్ నిద్ర లేవలేదు. సిద్దార్థ్‌ను లేపేందుకు ఆయన తల్లి ప్రయత్నించినా.. ఉలుకూ పలుకు లేదు. దీంతో సిద్దార్థ్ సోదరిని పిలిచారు. సిద్దార్థ్ సోదరి.. డాక్టర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అక్కడికి వచ్చిన డాక్టర్.. సిద్దార్థ్ మరణించినట్లు నిర్ధరించారు. వెంటనే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ క్రమంలో ముంబయిలోని కూపర్ ఆస్పత్రికి ఉదయం 10.30 గంటలకు సిద్దార్థ్‌ను తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రి వైద్యులు కూడా ఆయన ముందే చనిపోయినట్లు వెల్లడించారు" అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
వైద్యులు వద్దన్నా..