లాక్‌డౌన్‌లో చాలా విలువైన పాఠాలు నేర్చుకుంటున్నానని అంటున్నారు షారుక్ ఖాన్. తన కుటుంబంతో కలసి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన లాక్‌డౌన్‌లో తనకు బోధపడిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
'లాక్‌డౌన్‌లో ప్రేమకు అర్థం తెలుసుకున్నా' - షారుక్ ఖాన్ లేటెస్ట్ అప్డేట్
లాక్‌డౌన్‌లో జీవితానికి సంబంధించిన కొత్త పాఠాలను నేర్చుకుంటున్నట్లు తెలిపారు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఉరుకులు పరుగులు లేని జీవనాన్ని ఆస్వాదిస్తున్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు.
"ఇన్నాళ్లూ మనకు ఎంతో అవసరం అని భావించిన కొన్ని వస్తువులు ఏమాత్రం అవసరం లేనివని తెలిసింది. అలాగే మనచుట్టూ చాలా మంది మనుషులు ఉండాల్సిన అవసరమూ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకోగలిగిన కొంతమంది ఉంటే చాలు. ఐహిక సుఖాల కోసం పరుగులు పెట్టే అవసరం లేకుండా ఇలా గడియారాన్ని ఆపి మన జీవితం గురించి కొత్తగా ఆలోచించొచ్చు. మనతో పోట్లాడిన వారితోనే కలసి మనసారా నవ్వొచ్చు. వారి ఆలోచనల కన్నా మన ఆలోచనలేం గొప్పవి కావని తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమ అనేదానికి ఇంకా విలువ ఉందని అర్థమైంది" అని పోస్ట్ చేశారు షారుక్.
ఇదీ చూడండి.. నటన నుంచి నిర్మాణంలోకి ఎదిగిన ఛార్మింగ్ బ్యూటీ