తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవికి లాటరీలో ఏం వచ్చిందో తెలుసా?

ఇటీవలే ట్విట్టర్​లో తన ఖాతా ప్రారంభించాడు మెగాస్టార్​ చిరంజీవి. కరోనా లాక్​డౌన్​ కారణంగా అభిమానులతో దీని ద్వారా మరింత దగ్గరగా ఉంటున్నాడు. ఏప్రిల్​ 8వ తేదికి తనకు ఎంతో అనుబంధం ఉందని తాజాగా ట్వీట్​ చేశాడు. ఆ రోజుకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నాడు.

What did Megastar Chiranjeevi get in a lottery?
చిరంజీవికి లాటరీలో ఏం వచ్చిందో తెలుసా?

By

Published : Apr 9, 2020, 10:07 AM IST

ఏప్రిల్‌ 8తో నాకు బోలెడంత అనుబంధం ఉందంటూ ఈ నెల 6న ట్వీట్‌ చేశాడు మెగాస్టార్​ చిరంజీవి. అప్పట్నుంచి ఆ రోజు ప్రత్యేకత ఏంటంటూ ఆరా తీశారు అభిమానులు. 8వ తేదీ కోసం ఎదురు చూశారు. ఆ రోజుతో తనకున్న అనుబంధాన్ని బుధవారం ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టాడు చిరు. చిన్నతనంలో తనకు లాటరీలో వచ్చిన ఆంజనేయ స్వామి చిత్రంతో పాటు ఆనాటి తన ఫొటోని పంచుకుంటూ వాటి వెనకున్న ఆసక్తికరమైన విషయాల్ని గుర్తుచేసుకున్నాడు.

లాటరీలో గెలుచుకున్న చిత్రపటం

"ఈరోజు హనుమజ్జయంతి. చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది. 1962లో నాకు ఓ లాటరీలో ఆంజనేయుడి బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి దాన్ని నా దగ్గర భద్రంగా దాచుకున్నా. ఆరోజు నా చేతిలో ఆ బొమ్మను చూసి మా నాన్నగారు, 'ఆ కనుబొమ్మలు, కళ్లు, ముక్కు... నీకూ అచ్చం అలానే ఉన్నాయి' అన్నారు" అంటూ ఆ ఫొటోల వెనక కథని తెలిపాడు చిరంజీవి.

చిరంజీవి చిన్ననాటి చిత్రం

మరో ట్వీట్‌లో ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు గీసిచ్చిన ఆంజనేయస్వామి ఫొటోను పంచుకున్నాడు. "2002లో బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీసి పంపారు. నేను దాన్ని పాలరాతిపై అచ్చు వేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు బాపు ఓ మాట అన్నారు. 'ఏంటోనండి.. ఆ బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయి. అలానే ఉంచేశాను. మార్చలేదు' అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే" అంటూ ఆ ఫొటోతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు చిరు.

ఇదీ చూడండి.. బికినీతో హీటెక్కిస్తోన్న ఊర్వశి

ABOUT THE AUTHOR

...view details