ఆలియా భట్.. హీరోయిన్గా ఆకట్టుకుంటూ, పలు హిట్ సినిమాల్లో నటిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ విజయవంతంగా నడిపిస్తోంది. అయితే ఆమెకు కొన్ని విషయాలంటే భయమట. వాటిని గతంలో ఓ ఇంటర్యూలో వెల్లడించిందీ భామ.
ఆ రెండంటే హీరోయిన్ ఆలియాకు చాలా భయం - రాజమౌళి ఆలియా
హిందీతో పాటు తెలుగులోనూ కథానాయికగా చేస్తున్న ఆలియా భట్‌కు రెండు విషయాలు అంటే చాలా భయమట. వాటిని ఆమెనే స్వయంగా చెప్పింది. ఇంతకీ అవేంటి?
హీరోయిన్ ఆలియా భట్
తన స్నేహితులరాలు ఆకాంక్ష రంజన్‌తో జరిగిన ఈ ముఖాముఖిలో మాట్లాడిన ఆలియా.. ప్రేమించిన వ్యక్తుల్ని కోల్పోవడం, వైఫల్యాలను ఎదుర్కోవడం అంటే చాలా భయపడతానని చెప్పింది.
పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈమె నటిస్తోంది. ఇందులో ఓ కథానాయకుడు రామ్‌చరణ్‌కు జోడీగా కనిపించనుంది. ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం.