తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అద్భుత ప్రపంచం 'డిస్నీ వరల్డ్'​ పునఃప్రారంభం.. కానీ - 'డిస్నీ వరల్డ్'​ పునఃప్రారంభం.. కానీ

ప్రపంచ ప్రఖ్యాత 'వాల్ట్​ డిస్నీ వరల్డ్​ రిసార్ట్'​ అమెరికాలో పునఃప్రారంభమైంది. అయితే కరోనా నేపథ్యంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు నిర్వాహకులు.

disney
'డిస్నీ వరల్డ్

By

Published : Jul 11, 2020, 8:00 PM IST

లాక్​డౌన్​తో దాదాపు నాలుగు నెలల పాటు మూతబడిన అద్భుత ప్రపంచం 'వాల్ట్​​ డిస్నీ వరల్డ్ రిసార్ట్'​ అంతర్జాతీయంగా ఉన్న తన రిసార్టులను వరుసగా పునఃప్రారంభిస్తోంది. తాజాగా అమెరికాలోని లేక్​ బుయేనా విస్టా నగరంలోని డిస్నీకి చెందిన మాయాజాల ప్రపంచం (మ్యాజిక్​ వరల్డ్​), జంతు ప్రదర్శనశాల (యానిమల్​ కింగ్​డమ్​)లో యథావిధిగా జులై 11(శనివారం)న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

అయితే కరోనా నేపథ్యంలో కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు సంస్థ నిర్వాహకులు. సంస్థలోని ఉద్యోగస్థులు, కార్మికులు తప్పనిసరిగా వీటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

'ఎప్కాట్ థీమ్​ పార్క్​​', 'డిస్నీ హాలీవుడ్​ స్టూడియోస్'​ మరో నాలుగు రోజుల్లో తెరుస్తారు. ఇప్పటికే ఇందులోని షాపింగ్​ మాల్స్​, రెస్టారెంట్లు సహా అన్ని వినోద విభాగాలు మే నెలలో ప్రారంభమైపోయాయి.

'డిస్నీ వరల్డ్

ఇది చూడండి : ట్విట్టర్​లో ప్రభాస్ 'రాధే శ్యామ్' రికార్డు

ABOUT THE AUTHOR

...view details