అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను(Rajkundra porn case) పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రా కేసు విచారణలో భాగంగా ఆయన తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టుకు కారణమైన వీడియో షూట్ ఏదైతే ఉందో అది కేవలం వెబ్‌సిరీస్ చిత్రీకరణేనని అన్నారు. అది పోర్న్ కానే కాదని ఆయన తెలిపారు.
"ఈ మధ్యకాలంలో వస్తున్న వెబ్‌సిరీస్‌లను చూస్తే వాటిల్లో ఎక్కువగా అభ్యంతరకర సన్నివేశాలు మాత్రమే ఉంటున్నాయి. అదే మాదిరిగా ఇది కూడా ఓ వెబ్‌సిరీస్ మాత్రమే తప్ప పోర్న్ ఫిల్మ్ కాదు. మనకున్న సెక్షన్ల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తేనే దాన్ని పోర్న్ కింద వర్గీకరించాలి. అలా కాకుండా ఏ ఇతర అశ్లీల సన్నివేశాలను పోర్న్ కింద పరిగణించాల్సిన అవసరం లేదు" అని రాజ్‌కుంద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.