పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'పింక్' రీమేక్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అంతకంటే ముందుగానే 'అశ్వథ్థామ'తో మెగా అభిమానులందరినీ పలకరించనున్నాడట పవన్. ఆ విషయాన్ని హీరో నాగశౌర్యనే చెప్పాడు.
పవన్‌తోనే ప్రారంభం
'అశ్వథ్థామ' సినిమా.. పవన్ కల్యాణ్తోనే ప్రారంభమవుతుంది. సినిమా మొత్తాన్ని నడిపించేది ఆయనే. అలాగని సినిమాలో ఆయన కనిపించరు. కేవలం వినిపిస్తారంతే. ఈ చిత్రం ప్రారంభమయ్యేది పవర్‌స్టార్ వాయిస్‌తోనే అంటూ శౌర్య.. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఆధారంగా రూపొందించిన ఓ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'అశ్వథ్థామ'. ఇందులో హీరోకు 'అశ్వథ్థామ' పేరు పెట్టడం వెనుక 'గోపాల గోపాల'లోని ఓ డైలాగ్ స్ఫూర్తిగా నిలిచిందన్నాడీ కథానాయకుడు.