సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమాలున్నారు. తమిళనాడులో మాత్రం తలైవాకు వీరాభిమానులు లెక్కలేనంత మంది. అతడి సినిమా వస్తుందంటే చాలు ఉపవాసాలు, మొక్కులు చెల్లిస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు మధురైలో జరిగింది.
'దర్బార్' హిట్ కావాలని ఉపవాసం.. నేలపై భోజనం - cinema news
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'దర్బార్' పెద్ద హిట్ కావాలని పూజలు చేస్తున్నారు అతడి అభిమానులు. ఉపవాసం ఉండి, శీ అమ్మన్‌కు మొక్కులు చెల్లించి, ఒట్టి నేలపై భోజనం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
'దర్బార్' హిట్ కావాలని ఉపవాసం.. నేలపై భోజనం
ఇదే ఊరులో కొంత మంది రజనీ అభిమానులు.. గత 15 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు. బుధవారం మను సోరు(నేలపై భోజనం) చేశారు. ఇవాళ థియేటర్లలోకి వచ్చే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు.
ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు రజనీ. నయనతార హీరోయిన్. నివేదా థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.