తెలంగాణ

telangana

By

Published : May 19, 2020, 9:59 AM IST

ETV Bharat / sitara

'ఆ సినిమా షూటింగ్​లో మాకు క్యారవాన్లు లేవు'

"నాకు డ్రీమ్‌ రోల్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ ప్రస్తుతం నేను చేస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలోని పాత్ర ఎంతో విభిన్నంగా ఉండబోతోంది" అని చెప్పింది లావణ్య త్రిపాఠి. లాక్‌డౌన్‌ సమయం చాలా బోరింగ్‌గా ఉందని, ఎప్పుడెప్పుడు చిత్రీకరణకోసం సెట్స్‌లోకి అడుగుపెడతానా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది లావణ్య.

We have no caravans in the shoot of that film: Actress Lavanya Tripati
'ఆ సినిమా షూటింగ్​లో మాకు క్యారవాన్లు లేవు'

"అందం విషయంలో నేను నమ్మే సూత్రం ఒకటే. మన మనసులో ఏదైతే అనుకుంటామో దాన్నే మన ముఖంలో స్వచ్ఛంగా ప్రతిబింబించగలగడమే నిజమైన అందం" అంటోంది కథానాయిక లావణ్య త్రిపాఠి. 'అందాల రాక్షసి'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి పలు చిత్రాల్లో నటించిన లావణ్య.. గతేడాది 'అర్జున్‌ సురవరం'తో విజయం అందుకుంది. తాజాగా ట్విట్టర్​‌లో అభిమానులతో ముచ్చటించింది.

అప్పుడు క్యారవాన్లు లేవు

"నటిగా మారడం వెనక నాకు స్ఫూర్తినిచ్చిన కథానాయికలు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌. నా తొలి చిత్రం 'అందాల రాక్షసి' ఎన్నో విచిత్ర అనుభవాలు అందించింది. అది చిన్న బడ్జెట్‌ చిత్రం కావడం వల్ల మాకు క్యారవాన్లు ఉండేవి కావు. దీంతో ప్రొడక్షన్‌ వ్యాన్‌లోనే కాస్ట్యూమ్స్‌ మార్చుకునేదాన్ని. నేనెప్పుడూ మన నటనా నైపుణ్యాలు మనం చేసే పాత్రలపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతా. పాత్ర బలంగా లేకపోతే ప్రేక్షకులు అంతగా కనెక్ట్‌ అవ్వరని 'అందాల రాక్షసి'తోనే నాకర్థమైంది. నటిగా జీవితం కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంటుంది. విజయానికి సూత్రం అన్న మాటను అంతగా పట్టించుకోను. కానీ, మీలోని ధైర్యాన్ని నమ్మండి. మీ మనసు చెప్పిన మాట వినండి అని చెప్తా. ఈరోజుల్లో మనపై పడే ప్రతికూల భావాల్ని తగ్గించుకోవాలనుకుంటే సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తా" అని చెప్పింది త్రిపాఠి.

"జీవితంలో బాగా గర్వపడిన సందర్భమేంటి?" అని ఓ అభిమాని అడగ్గా.. "నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడిన రోజు" అని సమాధానమిచ్చింది లావణ్య. ప్రస్తుతం తెలుగులో 'చావు కబురు చల్లగా', 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' చిత్రాలతో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి.. అదే లుక్​లో అంతకుమించిన అంచనాలతో!

ABOUT THE AUTHOR

...view details