ప్రముఖ బాలీవుడ్ దంపతులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంకా వీళ్లు సంతానం గురించి ఆలోచించట్లేదని తెలిపింది ఆ జంట. ఇదే విషయంపై చాలా కాలంగా మీడియా, అభిమానులు, ప్రేక్షకులు దీపిక-రణ్వీర్లను పిల్లలను ఎప్పుడుకంటారు? అని అడుగుతున్నారు. వాళ్లు సమాధానం దాట వేస్తూ వస్తున్నారు.
తాజాగా ఈ విషయంపై దీపిక స్పందిస్తూ.."మాకు పిల్లలు కావాలని ఉంది. కానీ ఇది సరైన సమయం కాదు. మేము కెరీర్‌పై దృష్టి పెట్టాం. ఇందులో మా స్వార్థం ఉంది. కానీ కొన్నింటిని పొందాలంటే మరికొన్నింటిని వదులుకోవాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవమే. నన్ను కొంతమంది చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రశ్న మీకు రణ్‌వీర్‌లో ప్రేమకు ముందు పెళ్లి తరువాత తేడా ఏమైనా కనిపించిందా అని. నాకైతే అలాంటి భేదాలు ఏమీ కనిపించలేదు. మీకు మావారిలో మార్పులు కనిపిస్తే చెప్పండి" అంటూ సమాధానం చెప్పింది.