తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇకనుంచైనా మీరు ఆ పనులు మానుకోండి'

భారత్​లో కరోనా ప్రభావం తక్కువగా ఉండటం వల్ల భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పింది హీరోయిన్ రకుల్​ప్రీత్​. ఇకనుంచైనా ప్రజలు ప్రకృతిని ధ్వంసం చేసే పనులు మానుకోవాలని అభిప్రాయపడింది.

We are all harming nature: Rakul
ప్రకృతికి మనమే అపకారం చేస్తున్నాం: రకుల్​

By

Published : May 26, 2020, 12:31 PM IST

తమ మితిమీరిన చర్యలతో మనుషులు, ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని చెప్పింది నటి రకుల్​ప్రీత్​ సింగ్​. ప్రపంచమంతా కరోనా వేగంగా విస్తరిస్తున్నా, భారత్​లో ఈ వైరస్ ప్రభావం తక్కువ ఉండటంపై భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది​.

"కరోనా సమయంలో ప్రజల కష్టాలను చూస్తుంటే బాధేస్తోంది. కానీ మన దేశంలో అంతటి ప్రమాదకర పరిస్థితులు లేనందుకు భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రకృతి నిత్యం తన విధులు నిబద్ధతతో చేసుకుపోతుంటుంది. కానీ, మనం ఏమాత్రం కృతజ్ఞతా భావం చూపించకుండా మితిమీరిన చర్యలతో దానికి అపకారం చేస్తున్నాం. అందుకే ఈ అనర్థాలన్నీ. కాబట్టి ఇక నుంచైనా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కృతజ్ఞతా భావంతో మెలగాలి" అని చెప్పింది రకుల్‌. ఆమె ప్రస్తుతం కమల్‌హాసన్‌ 'భారతీయుడు 2'లో నటిస్తోంది.

ఇదీ చూడండి... నేను ఓ 'వేస్ట్​ లేడీ': శ్రుతి హాసన్​

ABOUT THE AUTHOR

...view details