బాలీవుడ్ దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, జులై 3న గుండెపోటుతో మరణించారు. అప్పటినుంచి పలువురు సెలబ్రిటీలు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. దీంతోపాటు ఆమెతో తమకనున్న మధుర స్మృతులను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంతాపం తెలిపిన నటి మాధురి దీక్షిత్.. త్రో బ్యాక్ వీడియో పోస్ట్ చేయడం సహా భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.
"నాకు ఎన్నో సందర్భాల్లో సరోజ్ స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో శక్తి సామర్థ్యాలు, జ్ఞానాన్ని అందించారు. ఎప్పటికీ నా మదిలో ఆమె స్థానం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎంతోగానో ఆమెను మిస్ అవుతున్నా" అంటూ మాధురి వ్యాఖ్య జోడించింది.
ఈ వీడియోలో భాగంగా మాధురి, సరోజ్‌ఖాన్.. ఐకానిక్ సాంగ్ 'ఏక్ దో తీన్' గురించి సంభాషిస్తూనే ముఖకవళికలతో డ్యాన్స్ వేశారు. ఈ పాటను ఎలా నృత్య దర్శకత్వం వహించారో అందుకు సంబంధించిన పలు విషయాలను చెప్పారు సరోజ్. కేవలం 20 నిమిషాల్లోనే ఈ పాట కొరియోగ్రాఫీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.