సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తర్వాత బాలీవుడ్ సూపర్‌స్టార్ అమిర్‌ఖాన్ తొలిసారి ఆ విషయమై మాట్లాడారు. తాను గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండలేదని, మీడియా ప్రభావం పెరిగినప్పటి నుంచి దాని ద్వారానే అప్‌డేట్స్ ఇస్తున్నట్లు చెప్పారు. అనవసరపు వదంతులు సృష్టించొద్దని కోరారు.
వదంతులు వద్దు.. అందుకే ఈ నిర్ణయం: ఆమిర్ ఖాన్ - ఆమిర్ ఖాన్ నాగచైతన్య
సోషల్ మీడియాకు తాను దూరమవడంపై అనవసర పుకార్లు సృష్టించొద్దని ఆమిర్ ఖాన్ కోరారు. ప్రస్తుతం ఈయన 'లాల్ సింగ్ చద్దా'లో నటిస్తున్నారు.
వదంతులు వద్దు.. అందుకే ఈ నిర్ణయం: ఆమిర్ ఖాన్
ఇటీవల 56వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్న అమిర్.. మరుసటి రోజే సోషల్ మీడియాకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ ప్రాజెక్టుల అప్‌డేట్స్‌ను తన నిర్మాణ సంస్థ అధికారిక ఖాతా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతం అమిర్‌ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.