పద్నాలుగేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తాజాగా వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తాను ఏ విధమైన ఒత్తిడిని ఎదుర్కొందనే విషయంతో పాటు దాని వెనకున్న కారణాల కోసం ఎలా ప్రయత్నించిందో ఆమె తెలిపింది. నెల రోజులుగా క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఇరా చెప్పింది.
"14 ఏళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యా. ఆ సమయంలో అతడు ఏమి చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ వ్యక్తి చేసిన చర్యల గురించి తెలుసుకోవడానికి నాకు ఏడాది కాలం పట్టింది. ఆ వెంటనే నేను నా తల్లిదండ్రులకు ఓ మెయిల్ ద్వారా నా పరిస్థితిని వెల్లడించా. ఆ ఘటన నుంచి బయటకు వచ్చిన తర్వాత కాస్త ఉపశమనం పొందా. అప్పటి నుంచి భయపడలేదు".