తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వార్నర్ బ్రదర్స్ చీఫ్ రాజీనామా - hollywood

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ చీఫ్ సుజిహార పదవి నుంచి తప్పుకున్నారు.  లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం.

సుజిహర

By

Published : Mar 19, 2019, 10:06 AM IST

Updated : Mar 19, 2019, 8:39 PM IST

హాలీవుడ్ నిర్మాణ సంస్థ 'వార్నర్​ బ్రదర్స్'​చీఫ్ కెవిన్ సుజిహార లైంగిక ఆరోపణలతో ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు.

" 25 ఏళ్లుగా స్టూడియోకు కెవిన్ సేవలందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు. ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్​ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు".
--జాన్ స్టాన్​కే, వార్నర్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్

బ్రిటీష్ నటి చార్లొటె కిర్క్, సుజిహార మధ్య నడిచిన మెసేజ్​ల పర్వాన్ని ఓ హాలీవుడ్ రిపోర్టర్ బట్టబయలు చేశారు. దీనిపై మార్చి నెల ప్రారంభంలోనే విచారణకు ఆదేశించింది వార్నర్ బ్రదర్స్. లైంగిక అవసరాలు తీరిస్తేనే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని సుజిహార అన్నారని ఆ మెసేజ్​ల్లో తేలింది.

"సంస్థలో కొనసాగడం వల్ల స్టూడియోకు నష్టం వాటిల్లుతుంది. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నా వల్ల సంస్థ పేరు చెడకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా".
- సుజిహార, వార్నర్ బ్రదర్స్ చీఫ్​

ప్రస్తుతం కొత్త చీఫ్​ను వెతికే పనిలో ఉంది వార్నర్ బ్రదర్స్ సంస్థ.

Last Updated : Mar 19, 2019, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details